ప్రపంచవ్యాప్త బెస్ట్ సెల్లర్ “ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్“ స్టీఫెన్ హాకింగ్ రచన, సైంటిఫిక్ రచనలలో ఒక మైలురాయి. అందుకు కారణం రచయిత మాట తీరు, ఎంచుకున్న అంశాలు పట్టి చదివించే రకం అన్నది మరొకటి. విశ్వం సృష్టిలో దేవుని పాత్ర, విశ్వం చరిత్ర, భవిష్యత్తు ఎవరికయినా ఆసక్తికరాలు. అయితే పుస్తకం ప్రచురణ తరువాత పాఠకులు, పుస్తకంలోని ముఖ్యమయిన అంశాలు అర్థంకావడం కష్టంగా ఉందని ప్రొఫెసర్ హాకింగ్‌కు చెప్పారు. అది నిజం.అందుకే ఎ బ్రీఫర్ హిస్టరీ ఆఫ్ టైమ్ పుస్తకం వచ్చింది. రచయిత పుస్తకంలోని అంశాలను పాఠకులకు మరింత సులభంగా అందాలి అనుకున్నాడు. అట్లాగే ఇటీవలి వైజ్ఞానిక పరిశీలనలను అందులో చేర్చాలి అనుకున్నాడు.మాటవరుసకు మాత్రమే ఈ పుస్తకం అంతకు ముందు దానికన్నా సంక్షిప్తంగా ఉంది. కానీ వాస్తవానికి, మొదటి దానిలోని అంశాలను మరింత విస్తృతంగా మార్చింది. కేయాటిక్ బౌండరీ పరిస్థితుల వంటి గణితం అంశాలు ఇందులో లేవు. మరొక పక్క ఎక్కువ మందికి ఆసక్తికరంగా ఉండే సాపేక్షత, స్థలం వంపు, క్వాంటమ్ సిద్ధాంతం వంటి అంశాలు పుస్తకమంతటా చెదురుగా ఉండేవి. ఇక్కడ వాటిని పూర్తి అధ్యాయాల కింద విడివిడిగా వివరించారు. ప్రత్యేకంగా ఆసక్తి కలిగించే అంశాలు, స్ట్రింగ్ సిద్ధాంతం, ఏకీకృత సిద్ధాంతం గురించిన కొత్త పరిశోధనలు, బలాల గురించిన సిద్ధాంతంవంటి ఇటీవలి అంశాలు, విస్తారంగా వివరించే వీలు రచయితకు అందింది. మొదటి ఎడిషన్‌లాగే, ఈ పుస్తకం మరింత ఎక్కువగా సైంటిస్ట్‌లు కాని వారిని కూడా కాలం, స్థలం గురించిన చిత్రమయిన రహస్యాల అన్వేషణలో ముందుకు నడిపిస్తుంది.ఎ బ్రీఫర్ హిస్టరీ ఆఫ్ టైమ్, సైన్స్ సాహిత్యానికి సరికొత్త కలయికగా అందరినీ అలరిస్తుంది.
STEPHEN HAWKING was a brilliant theoretical physicist and is generally considered to have been one of the world's greatest thinkers. He held the position of Lucasian Professor of Mathematics at the University of C ambridge for thirty years and is the author of A Brief History of Time which was an international bestseller. His other books for the general reader include A Briefer History of Time, the essay collection Black Holes and Baby Universes, The Universe in a Nutshell, The Grand Design and Black Holes: The BBC Reith Lectures. He died on 14 March, 2018.
Stephen HawkingAdd a review
Login to write a review.
Customer questions & answers