కొందరిని చూస్తే అన్నీ ఉన్న వారిలాగా కనిపిస్తారు. వారిని మెచ్చుకోకుండా, ఉండగలమా! సామాజిక సమావేశాలలో కానీయండి, వాణిజ్య సమావేశాలలో కానీయండి వారు అందరితోను దృఢవిశ్వాసంతో గలగలా మాట్లాడుతూ దర్శనమిస్తారు. మంచి ఉద్యోగాలు, ఉత్తములైన జీవిత భాగస్వాములూ, అమిత ఆసక్తి కలిగించే స్నేహితులూ అన్నీ వారి సొంతమే. వారు మీకంటే తెలివైన వారూ, స్ఫురద్రూపులు ఏమీ కారు. మరి వారి సఫలత వెనక రహస్యం ఏమిటి? అది కేవలం ఇతరులతో మాట్లాడటంలో వారి చతురత, చాకచక్యం. లేల్ లౌన్స్డ్ అంతర్జాతీయంగా పేరు పొందిన జీవన శిక్షకురాలు. ఉత్తమ అమ్మకాలు సాధించిన సంబంధ బాంధవ్య పుస్తకాల రచయిత్రి. మాటా మంతీ ఎవరితో ఎలాలో సఫలమైన సంభాషణ వెనక రహస్యాలు, మనస్తత్వము ఆమె మనకు తెలియ చెబుతారు. సరళము, ప్రభావ శాలులు అయిన ఈ 92 చిట్కాలతో మీరు • రాజకీయ వేత్తలాగా మీరు ఒక సమావేశం నడపగలరు • ఎటువంటి బృందంలోనైనా అంతరంగికులు కాగలరు • కీలకమైన మాటలు, శైలి ప్రయోగించి సంభాషణ నడిపించగలరు. • కలుపుగోలు తనానికి మీ శరీర విన్యాసాలు ప్రయోగిస్తారు. ఎవరితోనైనా సరే ఎప్పుడైనా సరే సంభాషణ సఫలం చేసుకోవటానికి ఈ పుస్తకం కీలకమైన సహాయం అందిస్తుంది.
Add a review
Login to write a review.
Customer questions & answers